తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్

 


*తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్*


*అమరావతి:*


స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్టు చేసి ఇక్కడే విచారించిన సీఐడీ పోలీసులు .


ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేసిన సిట్ పోలీసులు .


చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ నేతల ఆరోపణ .


సిట్ ఆఫీస్ సమీపంలో హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం చేయడం పై అప్పట్లో గవర్నర్ నజీర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు .


ప్రభుత్వం మారుతున్న సమయంలో సిట్ ఆఫీస్‌ను సీజ్ చేయాలని ఆదేశాలు .


ఇప్పటికే చీఫ్ సెక్రెటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు, విభాగాధిపతి ఆఫీస్‌లలో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశం .


గవర్నర్ ఆదేశాల్లో భాగంగానే తాడేపల్లి సీఐడీ సిట్ ఆఫీస్‌కు తాళాలు