పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ విజ్ఞప్తి
AP: తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని ప్రకటించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయన్నారు. తనకు అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 తరవాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తానని తెలిపారు.