*ఓట్ల లెక్కింపును శాంతియుతంగా పూర్తి చేసినందుకు అభినందనలు*
*•ఎన్నికల పక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు*
*రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*
అమరావతి జూన్ 5: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేసినందుకు మరియు మొత్తం ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభినందనలు తెలిపారు. ఇటు వంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్నందుకు నాకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుసరించిన మంచి పద్ధతులను భవిష్యత్తు తరాలవారికి ఎంతో ఆదర్శంగా మరియు మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక కరదీపికను రూపొందించాల్సిన అవసరాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుసరించిన వినూతన్న పద్ధతులను భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేధికలను తమ కార్యాలయానికి మూడు రోజుల్లో పంపాలని ఆయన కోరారు. అన్ని జిల్లాల నుండి వచ్చే నివేధికల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి భారత ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు.
*ఎన్నికల పక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు……*
ఐదేళకు ఒకసారి నిర్వహించే ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదములు తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటు వంటి విమర్శలకు ఆస్కారం లేకుండా రూపొందించబడిన శుద్ద మైన ఓట్ల జాబితా మొత్తం ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు నాందిపలికిందన్నారు. శద్దమైన ఓట్ల జాబితా రూపొందించేందుకు కృషిచేసిన అధికారులకు, సిబ్బందికి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు మరియు ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అదే విధంగా భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16 వ తేదీన ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి జూన్ 4 న ఓట్ల లెక్కిపు ప్రక్రియ పూర్తి చేసేంత వరకూ రాష్ట్ర స్థాయి నుండి జిల్లా, మండల స్థాయి వరకూ ఉన్న ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించడం జరిగిందని అభినందించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అవిరళ కృషిచేసిందని అభినందించారు. అదే విధంగా కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటను మినహా మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహంచడంలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*(పి ఆర్ ఓ, సి ఇ ఓ కార్యాలయం,ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*