అనకాపల్లి జిల్లా పోలీసు* *పత్రికా ప్రకటన*

 


*అనకాపల్లి జిల్లా పోలీసు* 

*పత్రికా ప్రకటన* 


 *2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ విధుల్లో అధికారులు మరియు సిబ్బంది విజయవంతంగా నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపిన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు.* 


*పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ఎస్పీ* 


*అనకాపల్లి, జూన్ 5:* ఎలక్షన్ కమీషన్ ఎన్నికల తేదీలను ప్రకటించిన నప్పటి నుండి జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల  పోలింగ్, కౌంటింగ్ లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు మరియు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపిన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీ కృష్ణ ఐపీఎస్., గారు   


పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించి నందుకు గాను అన్ని వర్గాల ప్రజలు , రాజకీయ పార్టీలు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


కేంద్ర, పోలీసు బలగాలతో పాటు అన్ని శాఖల సమన్వయంతో   సమర్ధవంతంగా విధులు నిర్వహించడంలో అందరి కృషి ఉందన్నారు. జిల్లా  పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ బాగా పని చేశారని హోంగార్డు నుండి అందరు అధికారులు  కష్టపడి పనిచేశారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు కొనియాడారు. 


*జిల్లా పోలీసు కార్యాలయం,* 

*అనకాపల్లి.*