ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన













 ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను  తక్షణమే విడుదల చేయాలని ఆమ్  ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన*                 ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బి.జె.పి పార్టీ రాజకీయ కక్ష తోటి జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుషితంగా దర్యాప్తు సంస్థలైన సి.బి.ఐ, ఈ.డీ లను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి బస్టాండ్  వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయునికి ఇండియా కూటమి నేతలు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి *ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరు గట్టు నగేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాగంటి గోపాల్ రెడ్డి, సి.పి.ఐ పార్టీ జిల్లా కార్యదర్శి  మురళి, సి.పి.ఎం నగర కార్యదర్శి బాలసుబ్రమణ్యం* లు విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బి.జె.పి పార్టీ విపక్ష నేతలను భయపెట్టడం , లొంగ తీసుకోవడం ,భయభ్రాంతులకు గురి చేయడం అజెండాగా పెట్టుకుని తప్పుడు కేసులను బనాయించి బెల్ ఇవ్వకుండా, జైల్లో బంధించడం బిజెపి అజెండాగా పెట్టుకొని పనిచేస్తుందని దీని ద్వారా ప్రజాస్వామ్యం కుంటుపడుతున్నదని వాపోయారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నేతలు అరవింద్ కేజ్రీవాల్ కు విద్యార్థి ,యువజన ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయని సంఘీభావం తెలియజేశారు. కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలతో దినదినం క్షీణించడం చూస్తుంటే బి.జె.పి చంపాలని కుట్ర చేస్తుందన్నారు. తక్షణమే ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని కేజ్రీవాల్ ను  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో *ఆప్  జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి బి .సునీల్, విద్యార్థి నాయకులు కిరణ్, యువజన నాయకులు గంగాధర్, డాక్టర్ విభాగం నాయకులు‌ అహ్మద్, యూత్ కాంగ్రెస్ తిరుపతి సిటీ ప్రెసిడెంట్ బేరిపల్లి వెంకట్ గౌడ్, సి.ఐ.టి.యు నాయకులు మాధవ్ కృష్ణ, వేణు, ఏ.ఐ.టి.సి నాయకులు ఎన్ . డి.రవి* తదితరులు పాల్గొన్నారు.