అత్యాచార ప్రయత్నం దాడిలో న్యాయం జరగక...

 *అత్యాచార ప్రయత్నం దాడిలో న్యాయం జరగక... వాష్మోలు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ*


*బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పిన సుగవాసి సుబ్రహ్మణ్యం*


*రాయచోటి టౌన్*


అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట నియోజవర్గం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో అదే గ్రామానికి చెందిన పెద్ద రెడ్డప్ప అనే వ్యక్తి చేతిలో అత్యాచార ప్రయత్నానికి గురై పోలీస్ స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురైన నాగరత్న అనే మహిళ బుధవారం వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బాధితురాలు కథనం మేరకు వివరాలలోకి వెళితే ఓదివీడు గ్రామం దూల హరిజనవాడ చెందిన నాగరత్న మంగళవారం బాత్రూంలో స్నానం చేసేందుకు వెళ్లగా అది గమనించిన పెద్ద రెడ్డప్ప అనే వ్యక్తి ఆమెపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడడంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే ఆమె తన భర్తతో కలిసి వీరబల్లి పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై పలు రకాలుగా విచారించడంతోపాటు నిన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నాడు ఏం చేసినాడని అవమానీయంగా అడగడంతో మనస్థాపానికి గురైన నాగరత్న వాస్మాల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం బుధవారం రాత్రి ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాధితురాలు నాగరత్నతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళపై జరిగిన అత్యాచార ప్రయత్న సంఘటనపై పూర్తిస్థాయిలో విచారించడమే కాకుండా పోలీసులతో కూడా మాట్లాడి నిజంగా పోలీసులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేయకుండా అవమానీయంగా మాట్లాడి ఉంటే సదరు పోలీసులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.అలాగే బాధితులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.