సబ్జెక్టు టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్న పాఠశాలలో కూడా 100 శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యం?

 


*తల్లిదండ్రుల తో చర్చకు...* 


 *పరీక్ష ల నిర్వహణ....* *అనుభవాల... నుండి* 


 *ఓ బలమైన కోరిక....* 


నేడు మన పిల్లల కు ఖచ్చితంగా మార్పులు అవసరమే. కనీసం చదవడానికి, రాయడానికి రానివారికి సైతం పబ్లిక్ పరీక్షలలో 80 శాతం మార్కులు ఎలా వస్తాయి? 

సబ్జెక్టు టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్న పాఠశాలలో కూడా 100 శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యం? 

సంవత్సరమంతా పాఠం చెప్పని ఉపాధ్యాయులు పరీక్ష రోజు మాత్రం యాక్టివ్ గా ఉండి ఇన్విజిలేటర్లు, చీఫ్ లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతారు. వారికి మందు, బిర్యానీలు అరేంజ్ చేస్తారు. డబ్బులు ఇస్తారు. దీనికోసం విద్యార్థుల నుండి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేస్తారు.


పరీక్ష ప్రారంభం అయిన 10 నిముషాలకే ప్రశ్నపత్రం బయటకు తెప్పించి సమాధానాలు అన్నీ రాయించి మైక్రో జిరాక్స్ చేయించి ప్రతి విద్యార్ధికి ఒక కాపీ ఇచ్చి విచ్చలవిడిగా కాపీయింగ్ ను ప్రోత్స హిస్తున్నారు.


 నిజాయితీగా పరీక్షలు నిర్వహిస్తే 30-40 శాతం పాస్ అవుతారు.(పాత కాలం లో అంటే ప్రభుత్వలు టార్గెట్లు పెట్టనపుడు... ఉత్తీర్ణత శాతం ఎందుకు తక్కువ గా ఉండేది... ఆనాటి వారు మేధావులు... దేశ దిశ నిర్దేశకులు కాలేదా...?.) కానీ 90 శాతం ఉత్తీర్ణత ఎలా సాధ్యం....??


సంవత్సరమంతా కష్టపడి చదివిన విద్యార్థుల కంటే కాపీ కొట్టి రాసినవారికే ఎక్కువ మార్కులు రావడం వల్ల నిజాయితీగా పరీక్షలు రాసినవారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. దీనివల్ల వారు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు.


 పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తేనే...

 విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో బాధ్యత పెరుగుతుంది. ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తారు. 


మనం ఉత్తీర్ణత శాతం తగ్గితే ప్రభుత్వాన్ని విమర్శించడం, ఉపాధ్యాయులను నిందించడం మానుకోవాలి. ఒకటి, రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలి. 


ప్రభుత్వాలు అత్యుత్సాహం తో టార్గెట్లు పెట్టడం విరమించుకోవాలి...

విధ్యలో రాజకీయ జోక్యం మాని...

ఓటు బ్యాంకు కోసం... ఉద్దీపనలు దీవెన లు పక్కనపెట్టి..

పోటీ ప్రపంచంలో పిల్లలు నిలిచేందుకు....

అందు తగిన  విద్యా విధానం తీసుకోరావాలి... 

 పిల్లల ఉన్నతమైన విద్య అందించేందుకు ....

అధ్యాపక ఖాళీల భర్తీకి ...... , కొత్త పాఠశాల, కళాశాల ఏర్పాటుకు...మౌలిక వసతుల కల్పనకు... 

రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలి... దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి...


ఉపాధ్యాయులు హక్కులు కోసమే కాక...,  ఇతర సొంత వ్యాపకాలు మానుకోవాలి.. ఆదర్శంగా ఉండడం.... ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థికి గౌరవభావం.... పెరిగే విధంగా నడుచుకోవాలి..

ప్రభుత్వ లు ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ...

నాటి పిల్లలు... భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు గా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేయాలి..


నేను కష్టపడి చదవక పోతే ఫెయిల్ అవుతా... అని విద్యార్థి కి... విద్యార్థి తల్లిదండ్రులు గ్రహించి నపుడు తరగతి గదిలో టీచర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాడు. ఇంటికెళ్లి చదువుతాడు...

ఇంట్లో మన పిల్లల చదువు సంబంధించి కొత్త మేర సమయం.... పర్యవేక్షణ బాధ్యతలు తల్లిదండ్రులు తీసుకోవాలి..

ఒక వేళ టీచర్ సక్రమంగా పాఠాలు చెప్పకపోతే విద్యార్థి, వారి తల్లిదండ్రులు ప్రశ్నించాలి. 

ఇది మంచి విమర్శ గా తీసుకోంటే.....ఉపాధ్యాయులకు ఒకింత గౌరవం పెరుగుతుంది..


మీ ఆదర్శానికి....ఓ చాలెంజ్ 


అన్ని తరగతుల విద్యార్థుల లలో 


అక్షరాలు రాని చదవడం రాని పిల్లలు ముందు వారు ఏ తరగతిలో ఉన్నా ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొని అవసరమైతే స్కూల్ టైం తరువాత కూడా కొంతమంది సమయం వెచ్చించి వారికి అక్షరాలు నేర్పేలా ఆదేశాలు జారీచేయాలి. 

ప్రతి ఉపాధ్యాయుడు ఈ సమాజం నీకు నీ కుటుంబానికి చూపిన జీవనభృతి కి కృతజ్ఞతుడై   నీ వంతు సామాజిక స్పృహ తో కృషి చేయాలని మా విజ్ఞప్తి.


 ప్రతి రోజు పాఠశాల కళాశాల సమయం తదుపరి శెలవుల లో ఓ గంట పాటు ట్యూషన్ చెప్పాలి ఇది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి 


అక్షరాలు రాని విద్యార్ధికి మొత్తం సిలబస్ పూర్తి చేసినా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. 


విద్యా శాఖ అధికారులు కొంత ప్రాక్టికల్ గా ఆలోచించాలి. టీచర్ లు ....టీచింగ్ నోట్స్, లెసన్ ప్లాన్స్, TLM తయారుచేయడంపై ఎక్కువ సమయం వృధా చేయకుండా అందరు విద్యార్థులు చదవడం, రాయడం నేర్పేలా చూడాలి.


ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు తలిదండ్రులం విజ్ఞప్తి చేస్తున్నాము 



-ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్