పత్తిపాటి చిన నారాయణమ్మ జ్ఞాపకార్థం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం

 ......పత్తిపాటి చిన నారాయణమ్మ జ్ఞాపకార్థం పట్టణంలో మెగా రక్తదాన శిబిరం 



చిలకలూరిపేట టౌన్..సెప్టెంబర్29

అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మరియు మాజీ మంత్రి, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి మాతృమూర్తి చిన నారాయణమ్మ జ్ఞాపకార్థం 

పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో  ఎన్డీఏ కూటమి, వాసవి యువ దళం, క్రేజీ గై స్, మరియు శ్రీ బాలగణపతి యూత్ , ఫైర్ ఆర్మీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు ఈ శిబిరాన్ని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు  ప్రారంభించనున్నట్టు మెగా రక్తదాన శిబిరం నిర్వాహకులు తెలిపారు.. ఈ సందర్భంగా యువత వేలాదిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు.