అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో 155 వ గాంధీ జయంతి సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ చిన్నమండెం మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలం గా గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మనం తినే పండ్లకు కూడా ప్లాస్టిక్ ను వినియోగించి మనకు అమ్ముతున్నారని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను. ప్లాస్టిక్ కవర్లు గాని ప్లాస్టిక్ సంచులు గాని ప్లాస్టిక్ అనబడే ఏ వస్తువునైనా మన నుంచి దూరంగా ఉంచాలని. ప్లాస్టిక్ను వాడటం వల్ల అనేక క్యాన్సర్ జబ్బులకు కారణాలు ఏర్పడతాయని. ప్లాస్టిక్ను వాడి పడేసిన తర్వాత ఒక తరం వరకు అది కులదని దానివల్ల భూమిలో రసాయనాలు వెలువడి అది క్యాన్సర్ ప్రభావాన్ని మనపై చూపిస్తుందని కాబట్టి ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ను నిషేధం చెయ్యాలని ఎంపీడీవో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎంపీడీవో స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది గ్రామ ప్రజలతో ప్రారంభించడం జరిగింది సభకు హాజరైనటువంటి ఉపాధి కూలీలు ఏపీవో సచివాలయం సిబ్బంది గ్రామ సర్పంచ్ అందరూ కూడా ఈ గ్రామ సభలో పాల్గొనడం జరిగింది సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సులు గ్రామసభలు ఎన్నో ఏర్పాటు చేయాలని ప్రజలలో చైతన్యం అవేర్నెస్ తీసుకురావాలని ఎంపీడీవో చెప్పినట్టు ప్లాస్టిక్ ను మన గ్రామం నుంచే కాకుండా మండలం నుంచి కూడా పూర్తిస్థాయిలో తరిమికొట్టాలని ఆయన మాట్లాడారు జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం గర్వంగా ఉందని ఏపీఓ.గాంధీ జయంతి సందర్భంగా గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబం వాళ్లకు కల్పించిన పరిధినాలను వాళ్లు సద్వినియోగం చేసుకొని ఉపాధిలో క్రొత్త వరవడి తీసుకురావాలని ఏపీఓ మాట్లాడడం జరిగింది