చిరు ఉద్యోగుల కడుపు కొట్టొద్దండి

 చిరు ఉద్యోగుల కడుపు కొట్టొద్దండి



 



*ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీ నిలబెట్టుకొని వాలoట్రీలను  కొనసాగించాలి*


 *ఎన్నికల హామీ ప్రకారం పదివేల రూపాయల గౌరవేతనం ఇవ్వాలి*

4 నెలల బకాయిలు చెల్లించాలి


 *రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంట్రీలను కొనసాగించాలి*


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ మరియు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు  సోమవారం నాడు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారి నుండి కలెక్టరేట్ వద్దకు మొదటగా ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు అనంతరం  కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా.. సిపిఐ జిల్లా కార్యదర్శి పి ఎల్ నరసింహులు, వాలంటీర్లు అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు పి మహేష్ అధ్యక్షులు నరసింహులు, అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు తపాయి వెంకటేష్  లు మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాల కాలము నుండి వాలంటీర్లు కేవలం 5000 రూపాయల జీతంతో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు చేసిన సేవ వర్ణించలేనిదని.. అలాంటి వాలంటీర్లను.. గతంలో  ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు  ఎన్నికల హామీ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లను కేవలం 5000 రూపాయలు జీతం ఇస్తూ వైకాపా ప్రభుత్వం వెట్టి చాకిరి చేపించుకుంటున్నదని .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన  వెంటనే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పదివేల రూపాయలు జీతం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు అవుతున్నప్పటికీ  వాలంటీర్ల గోష కనపడలేదా వినపడలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.  నాలుగు నెలల నుండి గౌరవ వేతనము లేక అనేక మంది వాలంటీర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. నిరుద్యోగ యువతీ యువకులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రకరకాల కారణాలతోటి వాలంటీర్ల కడుపు కొట్టడం మంచి సంప్రదాయం కాదని వెంటనే వాలంటీర్లను కొనసాగించి తక్షణమే పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పాలకులు రాజకీయ ఒత్తిళ్లతో చిరు ఉద్యోగులను రాజీనామా చేపించి వాలంటీర్ల కడుపు కొట్టారని అలా బలవంతంగా రాజీనామా చేపించిన వాలంటీర్లను యధావిధిగా మళ్లీ ఉద్యోగాలలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.

 కూటమి ప్రభుత్వానికి తిరుమల లడ్డు పైన ఉన్న శ్రద్ధ  మద్యపానం పైన ఉన్న శ్రద్ధ ల్యాండ్ వైను సాండ్  పైన ఉన్న శ్రద్ధ ఎందుకు లక్షలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులైనటువంటి చిరు ఉద్యోగుల వాలంటీర్లను ఆదుకునేటువంటి శ్రద్ధ ఎందుకు చూపు లేకపోతున్నదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను సచివాలయంలో విలీనం చేస్తామని చెప్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మబలికి.. ఇప్పటివరకు వాలంటీర్  అనే వ్యవస్థనే లేకుండా కనుమరుగు చేయడం.. రాజకీయ ఉద్దేశాలు ఏవైనప్పటికీ కూడా నిరుద్యోగ యువతలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే రాజకీయ నాయకులు ఇచ్చే మాటలకు విలువ ఉండదని అర్థం కింద ఏర్పడుతుందని అటువంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు

వాలంటీర్ల చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ నాయక్, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ,అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్, మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా వాలంటీర్ల అసోసియేషన్ నాయకులు వెంకటరమణ, మీనా సాయి కృష్ణ రెడ్డి ప్రసాద్ గంగిరెడ్డి సిద్ధిక్ ఫయాజ్ బేబమ్మ ప్రసాద్ రెడ్డి సుధాకర్ మహేష్ లలిత విజయలక్ష్మి, రెడ్డి సుధీర్ వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది వాలంటరీలు పాల్గొన్నారు