విజయనగరంలో వాలంటర్ల నిరసన
*విజయనగరంలో వాలంటర్ల నిరసన*
గ్రామ సచివాలయ వాలంటరీలను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బొగత అశోక్ డిమాండ్ చేశారు.
సోమవారం(అక్టోబర్ 21) విజయనగరం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీలను కొనసాగించకపోవడం అన్యాయమన్నారు.
గ్రామాల్లో వాలంటరీలు ప్రజలకు చేరువుగా ఉండి మంచి సేవలు అందించారని తెలిపారు. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
ఫాస్ట్ న్యూస్
Comments
Post a Comment