విజయవాడ: చికిత్స వికటించి ఒకరి మృతి
విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కానూరు ఎస్బీఐ కాలనీకి చెందిన రమేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స వికటించి సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయమై 5టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.