కృష్ణా జిల్లా,
పెనమలూరు నియోజకవర్గం,
*ఉయ్యూరులో "ది ఏపీ టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్" మీడియా సమావేశం నిర్వహించారు*
*ఈ సందర్భంగా "ది ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్" అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ:*
చంద్రబాబు ఎన్నికలు ముందు టిప్పర్ యజమానుల కష్టాలు లేకుండా చూస్తాను అన్నారు .
4 నెలలు దాటిన పట్టించుకోలేదు.
సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వడం లేదు.
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పథకానికి తూట్లు పొడిచేలా, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేస్తున్నారు.
ఇసుక రీచుల్లో దళారి వ్యవస్థ నడుస్తుంది.
ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ ధరలకు ఎలా కట్టబెట్టారు.
ట్రాన్స్పోర్ట్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తక్షణమే మా డిమాండ్లు అమలుపరచాలి అని
ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు..
గత ఆరు ఏడు నెలల నుండి ఉపాధి లేక ఈఎంఐ లు కట్టుకునే స్థితిలో కూడా లేనట్లు ఆవేదన వ్యక్తం చేశారు
కనీసం మా వాహనాలలో లోడింగ్ కూడా అనుమతించట్లేదని, టెండర్ దారుల సొంత వాహనాలే లోడింగ్ చేస్తున్నారు.
అధికారులు కూడా తమపై కక్షపూరితంగా పలు రకాల కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.