ఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ నందు నాలుగు వేలమందికి క్రిస్మస్ కానుక
విజయవాడ విద్యాధరపురం RTC డిపో ఎదురు సందులో ఉన్నఫిలదెల్ఫియ ఎ.జి. చర్చ్ లో పాస్టర్లు ఛాల్స్ పి. జాకబ్ పాస్టర్ ,డా॥ ఫిలిప్ పి. జాకబ్ లు మంగళవారం నిత్యావసర సరుకులతో కూడిన క్రిస్మస్ కానుక ను సుమారు నాలుగు వేల మందికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం విజయవాడ నగరంలో కబేల ప్రాంతంలో వరద సంభవించి ఎంతోమంది నిరాశ్రయులు అవడం జరిగింది .దానివలన వారి జీవన విధానం అస్తవ్యస్తంగా అయినది అందుకు గాను జీసస్ ఆజ్ఞ గా మా చర్చి నందు క్రిస్మస్ కానుకను అందజేసామని వారు తెలిపారు.