*తడ మండలం తిరుపతి జిల్లా*
*ట్యాగ్ లైన్ :- తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నలుగురు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న తడ పోలీసులు*
తిరుపతి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కె రవి మనోహరాచారి సూచనల మేరకు నాయుడుపేట డిఎస్పి జి చెంచు బాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సిఐ ఎం మురళీకృష్ణ తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె కొండప నాయుడు కు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది సహకారంతో తిరుపతి జిల్లా శ్రీ సిటీ జీరో పాయింట్ వద్ద వివిధ రకాల బ్యాగులలో గంజాయిని చెన్నైకి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వాళ్లను విచారించి వాళ్ల వద్ద నుండి సుమారు 3 లక్షల విలువగల 20.8 కేజీల గంజాయిని ఒక సెల్ ఫోన్ ని స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశారు.
పట్టుబడిన ముద్దాయిలు దేవరాజ్, నరేష్, హరిహరన్, నారాయణ వీళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
పై కేసులో ముద్దాయిని పట్టుకొని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ తడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కే కొండప నాయుడు మరియు వారి సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు.