48 గంటలు మద్యం షాపులు మూసి ఉంచాలి

 *48 గంటలు మద్యం షాపులు మూసి ఉంచాలి*

*కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ*

మచిలీపట్నం :-



ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు  జిల్లా పరిధిలో అన్ని మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ఛీప్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ కే బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు.


 ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951 లోని  సెక్షన్ 135 సి ప్రకారం ఈసీఐ, ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిధిలో  మద్యం దుకాణాలను, బార్లను ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసిఉంచాలని, ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసేందుకు జిల్లా ప్రొఫెషన్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,