నిమ్మకూరు ఏపీఆర్‌జేసీ హాస్టల్‌ విద్యార్థినులకు వ్యక్తిగత భద్రత పై అవగాహన కల్పించిన పామర్రు పోలీసులు

 *నిమ్మకూరు ఏపీఆర్‌జేసీ హాస్టల్‌ విద్యార్థినులకు వ్యక్తిగత భద్రత పై అవగాహన కల్పించిన పామర్రు పోలీసులు.*

జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐ‌పి‌ఎస్ గారి ఆదేశాలతో, పామర్రు ఎస్‌ఐ వి. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు నిమ్మకూరు ఏ‌పి‌ఆర్‌జే‌సి కళాశాల విద్యార్ధినుల హాస్టల్ ను సందర్శించి వారికి వ్యక్తిగత భద్రత విషయంలో పాటించవల్సిన అంశాల గురించి, సైబర్ నేరాలు, పోక్సో చట్టాలు, డయల్ 112, శక్తి టీం విధుల గురించి వివరించి అవగాహన కల్పించారు. 



▪️ వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. 


▪️ అనుమానాస్పద వ్యక్తులు, పరిసరాల్లో ఏవైనా అనైతిక ఘటనలు గమనిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించడం గురించి తెలిపారు. 


▪️ సోషల్ మీడియా వేదికగా సైబర్ మోసాలు, హ్యారస్మెంట్, ఫిషింగ్ స్కాముల గురించి, గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ & ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను బాధ్యతాయుతంగా వాడాల్సిన అవసరం గురించి, నకిలీ లింకులు, అకౌంట్ హ్యాకింగ్ ముప్పులు, OTP షేరింగ్ వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


▪️ పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి రూపొందించిన POCSO చట్టం (Protection of Children from Sexual Offences Act, 2012) గురించి, ఉమెన్ సేఫ్టీ యాప్ గురించి తెలియజేసి, విద్యార్థినులు తమపై ఏదైనా వేధింపులు జరిగితే పోలీసులకు ఎలాంటి భయపడకుండా ఫిర్యాదు చేయాలని తెలిపారు. 


▪️ అలాగే కృష్ణా జిల్లా శక్తి టీం విధుల గురించి వివరిస్తూ, మహిళల భద్రత కోసం శక్తి టీం 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా శక్తి టీంకు సమాచారం అందించాలని ఆయన అన్నారు.


ఈ సమావేశంలో విద్యార్థినులు తమ సమస్యలను ఎస్‌ఐతో పంచుకున్నారు. ఎస్‌ఐ వారి సందేహాలను నివృత్తి చేశారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,