తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న మోతళ్ల వెంకట సుబ్బారావు గారు
శాశ్వత సభ్యత్వాన్ని అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 04.02.2025.
మైలవరం మండలం మర్సుమల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోతళ్ల వెంకట సుబ్బారావు (పెదబాబు) గారు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఆయనకు డిజిటల్ రూపంలో శాశ్వత సభ్యత్వం రశీదును ఇబ్రహీంపట్నంలో మంగళవారం అందజేశారు. ఇప్పటికి మైలవరం నియోజకవర్గంలో 11 మంది శాశ్వత సభ్యత్వములు నమోదు చేసుకున్నారు. ఇంకా శాశ్వత సభ్యత్వములు కూడా తీసుకోవాలని పార్టీ కుటుంబ సభ్యులకు సూచించారు. మోతళ్ల వెంకట సుబ్బారావు (పెదబాబు) గారిని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు ప్రత్యేకంగా అభినందించారు.