తాను చనిపోతూ కూడా పలువురికి ప్రాణదానం చేసిన బుద్ధన.

 

తాను చనిపోతూ కూడా పలువురికి ప్రాణదానం చేసిన బుద్ధన.*


 : 



తను చనిపోతూ కూడా పలువురికి ప్రాణదానం చేసిన బుద్ధన కోటేశ్వరరావు (55) నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణాజిల్లా  కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన బుద్ధన కోటేశ్వరరావు (వయసు 55) ఈనెల 5వ తేదీన బంటుమిల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం రాత్రి కోటేశ్వరరావు కు బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. అయితే ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు బుద్ధన కోటేశ్వరరావు కు సంబంధించిన హార్ట్, కిడ్నీ, లివర్ లను సోమవారం విజయవాడలో ప్రాణదానం చేయనున్నారు. ఇలా తను చనిపోతూ కూడా మరి కొంతమందికి అవయవ దానం చేసి ప్రాణాలను నిలబేడుతున్న బుద్ధన కోటేశ్వరరావు నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన మృతి పట్ల నీలిపూడీ గ్రామం శోకసంద్రం అయింది . అలాగే బంటుమిల్లి కృత్తివెన్ను మండలాలలో పలువురు కోటేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,