కాశ్మీర్ ఉగ్రవాదులు ను నిరసిస్తూ విజయవాడ నగరంలో

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

విజయవాడ... కాశ్మీర్ ఉగ్రవాదులు ను నిరసిస్తూ విజయవాడ నగరంలో ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో బిజెపి ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు 





కాశ్మీర్ లో భారతీయులపై జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాండిల్ ర్యాలీ 


పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ 


 *మంత్రి సత్య కుమార్ యాదవ్*  పాయింట్స్ 


ప్రపంచ దేశాలు అన్ని కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తు భారతదేశానికి అండగా నిలిచాయి 


 కొంతమంది ఉగ్రవాదులు పిరికిపంద చర్యగా పాల్పడి కొంతమంది అమాయకుల ప్రాణాలు తీశారు 


 దేశనాయకత్వం చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేదు


 గతంలో లాగా ఏం చేస్తే సాగుతుందనే భ్రమలో  ఉన్నారు


 ఎవరైతే ఉగ్రవాద దాడిలో చనిపోయిన 26 మందికి నివాళులర్పిస్తున్నాం 


 కచ్చితంగా ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెతికి వెతికి శిక్ష పడేలా చేస్తాం 


 అలాగే ఈ ఉగ్రవాద దాడిలో ఆంధ్ర ప్రదేశ్  విశాఖకు చెందిన చంద్రమౌళి  కావలికి చెందిన మధుసూదన్ ఈ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారు


 వారి పార్థివదేహాలు ఈరోజు వైజాగ్ చేరుకున్నాయి


 వారి మృతదేహాలను చూడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం వస్తున్నారు


 పార్టీ ఆదేశాల మేరకు అంత్యక్రియల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది


 అమర్నాథ్ యాత్ర లో భారీగా హిందువులు తరలి వస్తున్నారని 145 కోట్ల భారతీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఉగ్రవాద దాడి జరిగిందని మంత్రి పేర్కొన్నారు 


జమ్ము కాశ్మీర్ లోని  అనంతనాగ్ జిల్లా, పహల్  గామ్ నగరంలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని భారతీయజనతాపార్టీ NTR జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ .. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో భాగంగా బుధవారం సాయత్రం 6 గంటలకు విజయవాడ బందర్ రోడ్ వివేకానంద విగ్రహం వద్ద నుండి లెనిని సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

అసువులు బాసిన మన భారతీయులైన హిందూ బందువులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తీవ్రవాద దాడులను వ్యతిరేకించాలని, ఈ సంఘటనకు కారణం అయినా తీవ్రవాదులను వెంటనే శిక్షించాలని కోరూతూ బిజెపి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ జీ,NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బిజెపి రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజి,మువ్వల సుబ్బయ్య,కరినాగలక్ష్మి,బబ్బూరి శ్రీరామ్ ,ఆర్ముగం బిజెపి జిల్లా నాయకులు కోలపల్లి గణేష్,పిట్టల గోవిందు,పోతంశెట్టి నాగేశ్వరరావు,రత్నకుమారి,శాంతి,స్వాతి తదితరలు పాల్గొన్నారు.