తక్షణమే అర్బన్ యం ఈ ఓ పోస్టులు మంజూరు చేయాలి.

 తక్షణమే అర్బన్ యం ఈ ఓ పోస్టులు మంజూరు చేయాలి.



  భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు


1)పురపాలక నగరపాలక టీచర్స్ కి జిపిఎఫ్ సౌకర్యము కల్పించాలి ఇప్పటికే కమిషనర్ ఖాతాలో ఉండిపోయిన పిఎఫ్ మొత్తాన్ని నూతన పిఎఫ్ ఖాతాలకు బదిలీ అయ్యేలా చూడాలనీ 

2) పురపాలక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ అనుగుణంగా అవసరమైన హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఎజిటి పోస్టులు మంజూరు చేయాలని 

3) తక్షణమే అర్బన్  ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి భర్తీ  చేయాలని

4) నగరపాలక సంస్థలకు మంజూరు కాబడిన ఉపవిద్యాధికారి పోస్టులను కేవలం నగరపాలక ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని 

5) పదోన్నతులు డీఎస్సీ నియామకాల రేషియో 70 :30 స్పష్టత లేక ఆగిపోయిన పదోన్నతుల సమస్య వెంటనే పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని 

6) పురపాలక స్పౌజ్ ఉపాధ్యాయులు కొందరు జిల్లా పరిధిలో వేరువేరు మండల /పురపాలక/ నగరపాలక/ పరిధిలో పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున అంతర్ యాజమాన్య అంతర్ జిల్లా యాజమాన్య బదిలీలు కూడా చేపట్టాలి

7)పురపాలక పాఠశాలలో 398 రూపాయలతో గతంలో పని చేసిన 350 మంది స్పెషల్ టీచర్స్ కు జిల్లా పరిషత్తు టీచర్స్ కి ఇచ్చిన విధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని

8) పురపాలక నగరపాలక పరిధిలో నూతనంగా ఏర్పడిన స్లం ఏరియా ప్రాంతాలలో నూతన పాఠశాలలు తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి సుబ్బారావు కోరేరు.