వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ తనిఖీపై అవగాహన కార్యక్రమం

 వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్  తనిఖీపై అవగాహన కార్యక్రమం 



 చిలకలూరిపేట 

వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని కేబీ రోడ్లో పెట్రోల్ కొనుగోలు చేసినప్పుడు ఎలా తనిఖీ చేసుకోవాలో ప్రజలకు  తెలియజేసి నాయకులు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువు గురించి నాణ్యత మరియు ధరలను ప్రశ్నించే హక్కు వినియోగదాలకు ఉంటుందని అన్నారు. అదేవిధంగా పెట్రోలు బొంకులలో పెట్రోల్ కొనుగోలు చేసి పోయించుకునేటప్పుడు 

మీటర్ రీడింగ్ చూసుకోవటం, పెట్రోల్ నాణ్యతను పరీక్షించుకోవడం, 

పెట్రోలు కొలత తనిఖీ చేసుకోవటం, మరియు పెట్రోల్ బంక్ లో ఉండే ఇతర వసతులను తెలుసుకొని ఉపయోగించుకోవటం.. ఏదైనా నష్టపోయామని తెలుసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు , సభ్యులు నందిపాటి రవి, ఏం పుష్పవల్లి , తూబాటి సుభాని తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,