ఆక్యుపంక్చర్ వైద్యం వైపు పెరుగుతున్న ప్రజల ఆసక్తి*

 *ఆక్యుపంక్చర్ వైద్యం వైపు పెరుగుతున్న ప్రజల ఆసక్తి* 



చిలకలూరిపేట: స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్‌లో మంగళవారం సాయంత్రం లైఫ్ ఆక్యుపంక్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆక్యుపంక్చర్ వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ షేక్ సాదిక్ మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, రకరకాల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత, చర్మ వ్యాధుల నివారణకు ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యమైన ఆక్యుపంక్చర్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

నేటి కంప్యూటర్ యుగంలో యువత శారీరక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వెన్ను నొప్పి, జుట్టు రాలడం, మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, వృద్ధులు బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతం, వేరికోస్ వెయిన్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, ఈ వ్యాధులన్నింటికీ ఆక్యుపంక్చర్ వైద్యంలో సహజసిద్ధంగా నివారణ సాధ్యమని షేక్ సాదిక్ వివరించారు. తదనంతరం అసోసియేషన్ సభ్యులకు ఉచిత ఆక్యుపంక్చర్ వైద్యం నిర్వహించారు. కార్యక్రమంలో లంకా ఆది రెడ్డి, కె. మురళీధర్ రావు, జి. వెంకటప్ప, మరియు అసోసియేషన్  సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,