ప్రతి ఒక్కరికి అవగాహన
వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
...... చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ
శ్రీనివాసరావు
వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం గురించి ప్రతి ఒక్క పౌరుడు, అదేవిధంగా ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు అన్నారు.
ఈ మేరకు గురువారం కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం వారు రూపొందించిన
పోస్టర్లను కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ఎంతో పటిష్టమైనదని అన్నారు
వినియోగదారుడు తను నష్టపోయినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో వినియోగదారుల కోర్టు ద్వారా నష్టపరిహారం మరియు, మానసికమైన వ్యధకు కూడా పరిహారం పొందవచ్చునని తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థులు స్ట్రీట్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి హానికరమని అన్నారు. కల్తీ ఆహారం గురించి, తూకాలలో వ్యత్యాసాలు, తదితర అంశాలపై ఫోరం సభ్యులు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు.
ఉన్నతాధికారులను సంప్రదించి విద్యార్థులకు ఈ చట్టం గురించి అవగాహన తరగతులు వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం వంటి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు కేబి రోడ్ లోగల
పెట్రోల్ బంకు వద్ద ప్రజలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 రత్నకళ, కన్జ్యూమర్ రైట్ ప్రొటె క్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, సిఆర్పిఎఫ్ఐ పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్,
ప్రధాన కార్యదర్శి రవి, నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి గాలయ్య, సహాయ కార్యదర్శి పొన్నం శ్రీనివాసరావు
తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment