ఏపీలో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి ఈ రూల్ గురించి తెలుసా.

 ఏపీలో గ్యాస్ సిలిండర్లు వాడేవారికి ఈ రూల్ గురించి తెలుసా.. ఆ డబ్బులు ఇవ్వొద్దు, వివరాలివే



AP Govt LPG Cylinder Delivery Charges: ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక. సిలిండర్ డెలివరీకి రశీదులోని డబ్బు మాత్రమే చెల్లించాలని, అదనపు ఛార్జీలు ఇవ్వవద్దని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి 1967, 1800 2333555 టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. 5 కిలోమీటర్లలోపు ఉచిత డెలివరీ ఉంటుందని, ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒకవేళ ఎవరైనా ఇలా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే జిల్లాలో పౌరసరఫరాలశాఖ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాదు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కాల్‌ సెంటర్‌ 1967కు, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 2333555కు ఫిర్యాదు చేయొచ్చు. వాస్తవానికి గ్యాస్ డీలర్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్లలోపు సిలిండర్ డెలివర్ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు వరకు అయితే సిలిండర్‌కు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అదే 15 కిలో మీటర్లు, ఆ పైన దూరం ఉంటే రూ.30 చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా ఇలా గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే జిల్లాలో పౌరసరఫరాలశాఖ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాదు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కాల్‌ సెంటర్‌ 1967కు, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 2333555కు ఫిర్యాదు చేయొచ్చు. వాస్తవానికి గ్యాస్ డీలర్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్లలోపు సిలిండర్ డెలివర్ చేసే సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు వరకు అయితే సిలిండర్‌కు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అదే 15 కిలో మీటర్లు, ఆ పైన దూరం ఉంటే రూ.30 చెల్లించాల్సి ఉంటుంది..

ఇలా ఒక్కో వినియోగదారుడు నుంచి రూ.30, రూ.50 చొప్పున వసూలు చేసి ఏకంగా రూ.కోట్లలో వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం గ్యాస్ వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో.. అదనంగా డబ్బులు వసూలు వెంటనే స్థానికంగా ఉండే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కాబట్టి గ్యాస్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని.ఐదు కిలో మీటర్లలోపు దూరంలో గ్యాస్ డెలివరీ ఇస్తే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు