న్యూస్ నైన్ న్యూస్ స్వాగతం సుస్వాగతం నేను దీప్తి:
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవార్లకి ఆషాడం సారే అందజేత మార్కాపురం:-
. సమరసత సేవా ఫౌండేషన్ మండల మహిళా కన్వీనర్లు ,సభ్యులు 40 మంది ఆధ్వర్యంలో పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ, కాలేజీ రోడ్డులో గల పోలేరమ్మ, కనకదుర్గమ్మలకు ఆషాడం సారె అందజేయడం జరిగింది
ఈ ఆషాడం సారే కార్యక్రమాన్ని ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు ఘన స్వాగతం తో మహిళలందరూ అమ్మవార్లకి భక్తిశ్రద్ధలతో సారే అందజేసి పూజలు చేశారు
ఈ సందర్భంగా కనకదుర్గమ్మ గుడి అర్చకులు మాట్లాడుతూ పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక్కొక్క విశిష్టత ఉందని అందులో ఆషాడ మాసంలో అమ్మవారికి సారె మరియు వివిధ రకాల పూజలు చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయని, ఈ మాసానికి దైవ బలం ఎక్కువ అని, ఈ మాసంలో మంత్రోచ్ఛరణ చేయడం వలన కుటుంబం అభివృద్ధి చెందుతుందని, పలు రకాల దోషాలకి హోమాల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు
మహిళా కన్వీనర్ గుంటక వనజాక్షి మాట్లాడుతూ ఈ ఆషాడ మాసంలో వాతావరణ మార్పుల కారణంగా ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఆరోగ్యం బాగుండాలని, వ్యవసాయ పనులకు అనుకూల సమయం కనుక పాడిపంటలు బాగా అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలకు ఆషాడం సారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆలయాల కమిటీ సభ్యులు చిర్లంచర్ల బాలమురళీ కృష్ణ,వెంకటేశ్వర్లు, అల్లూరి రెడ్డి,ఆదినారాయణ, వెంకటరెడ్డి,చెన్నకేశవులు, శ్రీధర్ రెడ్డి,
జిల్లా ధర్మ ప్రచారక్ అవిశినేని రమణయ్య,మహిళా కన్వీనర్లు రేణుక,మల్లీశ్వరి,భాగ్యలక్ష్మి,మరియు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు