నెల్లూరు కార్మికులపై దాడిని ఖండిస్తూ నిరసన
మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వ నిర్బంధం విడనాడాలి.
నెల్లూరు కార్మికులపై దాడిని ఖండిస్తూ నిరసన.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై పోలీసులు నిర్బంధాలతో దాడులు చేయించడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ మన్యం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
నెల్లూరు నగరంలో వర్క్ ఔట్సోర్సింగ్, పని ప్రైవేటీకరణ ఏజెన్సీలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సాలూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కోశాధికారి శంకర్ రవి రాముడు మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల ఇప్పటికే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
అందులో భాగంగానే పాలన సంవత్సరంనర దాటుతున్న 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు బెనిఫిట్ చనిపోతే ఉద్యోగాలు దహన సంస్కార ఖర్చులు పెంపు వంటి అంశాలకు నేటికీ జీవోలు ఇవ్వలేదని తెలిపారు.
పురపాలక శాఖ మంత్రి సొంత జిల్లా నెల్లూరులోనే వర్కౌట్ సోర్సింగ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటని అక్కడ ప్రయోగంగా పని జరిపి రాష్ట్రమంతా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.
ఇదే జరిగితే కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కనీస వేతనం హక్కుగా ఉండదని అప్పుడు జీతం ఎంతైనా తగ్గించి ఇచ్చే అవకాశం ప్రైవేటు ఏజెన్సీలకు వస్తుందని తెలిపారు.
ఈ నిర్ణయాలపై కార్మిక వర్గం నెల్లూరులో సమ్మె చేస్తుందని పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జ్ చేయించి అణచివేయాలని కూటమి ప్రభుత్వం చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఈ అగ్గి రాజుకొని కాలిపోయేది ప్రభుత్వమే అని,
గతంలో 279 జీవోను కార్మికులతో సంబంధం లేకుండా అమలు చేయాలని చూసి తెలుగుదేశం ప్రభుత్వం పోరాటానికి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేశారు జీవో కూడా రద్దు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఇందు శ్రీను పోలిరాజు వెంకన్న ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment