*అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మాదాసు భాను ప్రసాద్ కు సత్కారం*
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకొని
ప్రముఖ న్యాయవాది మరియు సమాజం సేవకుడు మాదాసు భానుప్రసాద్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాను ప్రసాద్ న్యాయవాద వృత్తిలోనే కాక సుదీర్ఘకాలంగా చిలకలూరిపేట పట్టణ ప్రజల సమస్యలు తమ దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలను స్వయంగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుటలో కీలకపాత్ర వహించారు. ఎంతోకాలంగా రోడ్డు ప్రమాదాలు జరగకూడదని
ప్రభుత్వ అధికారులను, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ రోడ్డు ప్రమాదాలు నివారణ కృషి చేస్తున్నారు. అంతేకాకుండా లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులుగా పలు ప్రజా సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారని క్లబ్ అధ్యక్షుడు పొన్నూరు శివ అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, హరిబాబు, వీరయ్య, సాదిక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment