తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం

 చిలకలూరిపేట... 



8వ వార్డు లోని మున్సిపల్ పాఠశాల లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతిక ఆధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రామానికి తల్లిదండ్రులు, విద్యార్థులు  పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా 8వ వార్డ్  కౌన్సిలర్ కొత్త కుమారి  పాల్గొని విద్యార్థులు కు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్డు కౌన్సిలర్ కోత్త కుమారి  మాట్లాడుతూ  విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో భావితరానికి ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు  ఆదర్శంగా నిలవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో  స్కూలు పిల్లలకు యూనిఫార్మ్స్, బూట్లు మరియు తల్లిదండ్రులకు మొక్కలు అందజేయడం జరిగినది