*జనసేన జనవానిలో చెరువుల కబ్జాపై ఫిర్యాదు*

 *జనసేన జనవానిలో చెరువుల కబ్జాపై ఫిర్యాదు*




*ఉత్తరాంధ్రలో ఐదు లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ చెరువులు భూములు కబ్జా...! 


*నీటి వనరుల పరిరక్షణను చేపట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలి* 


*శ్రీకాకుళం జిల్లాలో చెరువులు కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ కి ఫిర్యాదు 


*ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు*


 విజయవాడ:

 జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాని కార్యక్రమంలో  ఉత్తరాంధ్రలో జరుగుతున్న చెరువులు, గెడ్డలు, వాగులు, వంకలు తదితర ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు చేసినట్లు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. బుధవారం ఆ సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు అల్లు సత్యంతో కలిసి  జనసేన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పోలవరం జనసేన ఎమ్మెల్యే సీహెచ్ బాలరాజుకు ఉత్తరాంధ్రలో జరుగుతున్న చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పత్రికల్లో వస్తున్న చెరువుల కబ్జాల  కథనాలను  చూపిస్తూ బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో జరిగిన కబ్జాలను తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువచేసే చెరువులు ప్రభుత్వ భూములు స్కామ్ జరిగినట్లు తెలిపారు. దానిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నీటి వనరుల పరిరక్షణ పై సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పులు అమలు చేయాలని జిల్లా అధికారులపై బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో నెంబర్ 188, 386 ప్రకారం చెరువులను పరిరక్షించాల్సిన వాచ్ డాగ్ కమిటీ జిల్లా స్థాయిలో ఏర్పాటు కాకపోవడం వలన చెరువులు కబ్జాకు గురవుతున్నాయి అన్నారు. తక్షణమే వాచ్ డాగ్ కమిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే సెటిల్మెంట్ రికార్డులు ఆధారంగా నీటి వనలను గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని మండల స్థాయిలో రికార్డులు మాయంపై విచారణ జరిపించాలని రికార్డులు తారుమారు చేసిన అధికారులు పైన చర్యలు చేపట్టాలని కోరారు. చెరువుల్లో పెద్దపెద్ద భవనాలు  నిర్మితమవుతున్నాయని వాటిని తొలగించేందుకు హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా చెరువులు కబ్జాపై ఈనాడు దినపత్రికలో వచ్చిన  కథనాలపై తగు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత కబ్జాదారులపై, ఆక్రమణలను అడ్డుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం