ఈనెల 19న జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి..
ఈనెల 19న జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలి....
*మురికిపూడి ప్రసాద్
కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు* పల్నాడు జిల్లా
చిలకలూరిపేట ఈనెల 19వ తేదీ పట్టణంలోని సింగ్ మినీ ఫంక్షన్ హాల్లో జరగనున్న విద్యుత్ వినియోగదారుల సదస్సును వినియోగదారులు ఉపయోగించుకోవాలని పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ కోరేరు.
ఈ సదస్సు జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కానీ విద్యుత్ సమస్యలను ఆయన వెంటనే అక్కడే పరిష్కారం చేస్తారని తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను ఒక పేపర్ పై వ్రాసి తెలియపరచినట్లయితే వెంటనే పరిష్కారం చేస్తారు అన్నారు. ఇది సమస్యల పరిష్కారానికి వినియోగదారులు ఎటువంటి ఖర్చు పెట్టకుండా పరిష్కరించుకోవచ్చు అని అన్నారు.ఈ విషయం లో వినియోగదారులకు ఫోరం అండగా ఉంటుందని ఎవరైనా తమ సమస్యలను స్వయంగా తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే వినియోగదారుల సంఘం సభ్యులు ఆ సమస్యను పేపర్ పై వ్రాసి సహకరిస్తారని ఆయన తెలిపారు.
Comments
Post a Comment