ఒడిశా రాజధాని భువనేశ్వర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గారిని కలిసిన దాడి
ఒడిశా రాజధాని భువనేశ్వర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌గారిని కలిసిన దాడి
ఈరోజు ఆగస్టు 16వ తేదీన, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ వైస్ ఛైర్మన్, విశాఖపట్నం మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ తెలుగు దేశం పార్టీ నాయకుడు దాడి సత్యనారాయణ గారు, ఆయనతో పాటు డి. లక్ష్మణ్ కుమార్ వెంకటేష్ గారు, ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా గవర్నర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తరఫున వినియోగదారుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలను వివరించిన దాడి సత్యనారాయణ గారి అభిప్రాయాలకు, గవర్నర్ కమ్మంపాటి హరిబాబు గారు సానుకూలంగా స్పందించారు.
ఒడిశా రాజధాని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.
Comments
Post a Comment