నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలు

 నియోజకవర్గ విద్యుత్ వినియోగదారుల సమస్యలను సిజిఆర్ ఎఫ్ చైర్మన్ కు వివరిస్తున్న కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ 

  


పట్టణంలోని సింగు మినీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల న్యాయ సదస్సులో కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ పాల్గొని పలు సమస్యలను విశ్రాంత న్యాయమూర్తి మరియు సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ దృష్టికి తీసుకువచ్చారు. 

పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వినియోగదారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయకూడదని, అదేవిధంగా నెహ్రు నగర్ మధ్యనగర్ గుర్రాల చావిడి ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య ఉందని వారి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా విద్యుత్ ఎమర్జెన్సీ కాల్స్ కు సంబంధిత అధికారులు ఎవరూ కూడా సత్వరమే స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యుత్ షాక్ వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్టపరిహారాన్ని జాప్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని కోరేరు. విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్ను మరొకటి ఏర్పాటు చేయాలని, విద్యుత్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న విద్యుత్ కార్యాలయాన్ని వెంటనే తరలించి నూతన బిల్డింగుకు అనుమతి ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు వినతీ పత్రాన్ని సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఇమ్మానియేల్ సూచనల మేరకు సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ అజయ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు