ఏకగ్రీవంగా ఎన్నికైన *బోనం శ్రీనివాసరావు*

 తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ టిఎన్టియుసి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన *బోనం శ్రీనివాసరావు*



చిలకలూరిపేట 


  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోనం శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ  ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత  ఎన్నికలను నిర్వహించారు. ఈ  ఎన్నిక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మరియు కాపు సంఘం నాయకులైన బోనం శ్రీనివాసరావు రెండోసారి తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఎన్నికల సమయంలో ఆ వార్డుకు ప్రాతినిధ్య వహిస్తూ పార్టీ గెలిచేందుకు శ్రీనివాసరావు కష్టపడ్డారు. శ్రీనివాస రావు కృషిని గుర్తించిన మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు వారి ఆశీస్సులతో శ్రీనివాసరావు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారి ఎన్నిక  పట్ల పార్టీ నాయకులు మరియు కాపు సంఘం నాయకులు, కార్మిక సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తన పదవి కొరకు కృషి చేసిన కృషి చేసిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కు శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త నెల్లూరు సదాశివరావుకు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, 

పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి మరియు పార్టీ సీనియర్ నాయకులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు  పరిష్కారానికి కృషి చేస్తానని, అదేవిధంగా

 పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-