ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం".. మువ్వల

 ప్రెస్ నోట్,

" ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం".. మువ్వల 




 ఇటీవలే కూటమి ప్రభుత్వ విద్యా శాఖ మంత్రి ఇచ్చిన ఆర్. సి.నెంబర్ 30/67/2025 రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఉందని, ప్రతిపక్షాల,విద్యాసంఘాల గొంతులు నొక్కి ఏకపక్ష పరిపాలన చేసే విధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ మువ్వల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల హక్కులు,విద్యలో నాణ్యత,సామాజిక సమస్యలు వీటి గురించి ఎవరు ప్రశ్నించకుండా, పాఠశాలలోకి,హాస్టల్లోకి విద్యార్థులు యూనియన్ నాయకులు గాని రాజకీయ నాయకులు గానీ ఏ అన ధికార వ్యక్తులు లోపలికి రాకూడదనే నిబంధనలు విధించడం అన్యాయం అన్నారు. విద్యాసంస్థల్లో జరుగుతున్న అనేక అవకతవకలు బయటకు రాని ప్రమాదం ఉందని అన్నారు. అనేక చోట్ల వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, విద్యార్థులకు పెట్టే భోజనము, వసతులు పరిశీలించ దానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. దీనివల్ల విద్యాసంస్థల యాజమాన్యాలు మరింత రెచ్చిపోయి స్వలాభం కోసం విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి విప్పి  చేసి దోచుకునే అవకాశం ఉందన్నారు. ఈ జీవో వల్ల కొంతమంది అధికార పార్టీ నాయకులకు తప్ప ప్రజలకు ఉపయోగము లేదన్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు మరింత నష్టమే తప్ప ఉపయోగం లేదన్నారు. మరోసారి ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి జీఓని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు