ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేయటానికి నూతనంగా నిర్మించి విజ్ఞప్తి 167 ఏ జాతీయ రహదారిని ఉపయోగించుకోవాలని
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి 167 A జాతీయ రహదారి ఉపయోగించండి.
వినియోగదారుల సంఘం విజ్ఞప్తి
చిలకలూరిపేట న్యూస్9:
పట్టణంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను కట్టడి చేయటానికి నూతనంగా నిర్మించిన 167 ఏ జాతీయ రహదారిని ఉపయోగించుకోవాలని
కంజ్యుమర్ రైట్ ప్రొటేక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదివారం పట్టణ సీఐ పీ రమేష్ బాబు ను కోరుతూ ఎస్సై రహంతుల్లా ని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గడియార స్తంభం నుంచి కొద్ది దూరంలోనే 167 ఏ రహదారి అందుబాటులోకి వచ్చిందని, రహదారికి అందుకు వెళ్లే మార్గాలను ఒకసారి పరిశీలించి వాహనాల రాకపోకలను మళ్లించినట్లయితే కొంత మేరకు అయినా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వారు పట్టణ సీఐ పి రమేష్ బాబును కోరారు.. ఈ సందర్భంగా వినియోగదారులు సంఘం ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఎస్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్, కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్, సహాయ కార్యదర్శి గాలయ్య పాల్గొన్నారు.



Comments
Post a Comment