కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానాలను విస్మరించింది

 చిలకలూరిపేట: న్యూస్9

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గిరిజన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ  స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అక్రవర్ణాల ఆదిపత్యం ఎక్కువగా ఉండటం వలన బడుగు, బలహీన వర్గాల ప్రజలు చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో వారిచేత ఓట్లు వేయించుకొని వారికి కావల్సిన చిన్నచితికా పనులు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఇదే ధోరణి రానున్న రోజుల్లో కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మూడు మండలాల్లో, పట్టణంలో గిరిజన సమాఖ్యను బలోపేతం చేయడం కోసం కృషి చేయాలన్నారు. దీపావళి పండుగ తర్వాత నూతన కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరు బాబురావు,తోపాటు ఆయా మండలాలకు చెందిన గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం