నింగిలోకి వెళ్లిన మూడు శాటిలైట్లు.
న్యూస్ 9 ఛానల్ : కేఎల్సి యూనివర్సిటీ వడ్డేశ్వరం
*కెఎల్ శాట్ శాటిలైట్ల ప్రయోగం సక్సెస్.*
నింగిలోకి వెళ్లిన మూడు శాటిలైట్లు.
వాతావరణం, గాలిలోని తేమ, నాణ్యత, ఉష్ణోగ్రతల సమతుల్యతల పైన పరిశోధనలకు పునాది.
రాకెట్ ప్రయోగం దిశగా అడుగులు వేస్తామంటున్న కెఎల్ యు వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్.
అనుకున్నట్లుగానే కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్దులతో కలిసి రూపొందించిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కెఎల్ యూనివర్శిటీ తలపెట్టిన కెఎల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించింది.
1-బెలూన్ సహాయంతో మొదటి కెఎల్ జాక్ శాటిలైట్ ను నింగిలోకి పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి. శనివారం నాడు ఉదయం 5:45 నిముషాలకు కెఎల్ జాక్ శాటిలైట్ ను పీకో బెలూన్ సాయంతో కేంద్ర మంత్రి భూపతి రాజు, వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మలు, విద్యార్దులతో కలిసి నింగిలోకి వదిలారు. కెఎల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ కె.సిహెచ్.శ్రీకావ్య తెలిపారు.
2- కెఎల్ శాట్ 2 ను ప్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో కేఎల్ శాట్-2 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. పర్యావరణ సమాచారం సేకరించనున్న కేఎల్ శాట్-2 - వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయనునుంది. ఎటిసి గన్నవరం ఎయిర్ ట్రిపక్ క్లియరెన్స్ వచ్చాక 6:45 గంటలకు కెఎల్ శాట్ 2 ను ప్లైట్ మోడ్ డ్రోన్ సాయంతో నింగిలోకి పంపారు. నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లిన తరువాత కెఎల్ యు విద్యార్దులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా శాటిలైట్ 1 గంట పాటు నిర్దేశిత కక్ష్యలో భూమి నుండి సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో 60 కిలోమీటర్లు సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లి లాంచ్ ఫ్యాడ్ పైన విజయవంతంగా దిగింది. దీంతో వర్శిటీ ప్రాంగణంలో సంభంరాలు అంబరాన్నంటాయి.
3- కాన్ శాట్ ల ప్రయోగం విజయవంతం అయింది. కేంద్ర మంత్రి భూపతి రాజు, ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణం రాజులు, కెఎల్ యు వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్ లతోకలిసి కాన్ శాట్ ను నింగిలోకి వదిలారు. సర్వత్రా ఉత్కంఠ నడుమ కొనసాగిన ఈ ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతం కావడంతో అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నింగిలోకి వెళ్లిన కాన్ శాట్ సుమారు 20 నిముషాల పాటు ఆకాశంలోనే విహరిస్తూ కంట్రోల్ సెంటర్ కు ఎప్పటికప్పుడు డేటాను పంపుతూ సుమారు 20 నిముషాల తరువాత మళ్లీ లాంచ్ ఫ్యాడ్ వద్ద విజయవంతంగా దిగింది. దీంతో ప్రేక్షకులు, ఆచార్యులు, విద్యార్దుల కరతాళ ద్వనులతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది.
*అంతా అనుకున్నట్లుగానే....*
పరిశోధకులు ముందుగా చెప్పినట్లుగానే సుమారు గాలిలో గంటన్నర పాటు ప్రయాణించిన కెఎల్ శాట్ 2 భూమి గురుత్వాకర్షణ దాటుకుని సుమారు 12 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కడ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చూస్తూ వాతావరణంలోని మార్పులు, ఓజోన్ పొర గురించిన వివరాలను సేకరిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. సుమారు గంటసేపటి తరువాత తిరిగి లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకుని అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. రూపకర్త డాక్టర్ కె.సిహెచ్.శ్రీకావ్య వెల్లడించారు. గన్నవరం, చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతితో ఈ ప్రయోగం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా *కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ* మాట్లాడుతూ కెఎల్ వర్శిటీ విద్యార్దులు రూపొందించిన శాటిలైట్ ను తాను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. కెఎల్ యూనివర్శిటీ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ నెల 27న ఉత్తర ప్రదేశ్ లో జరగనున్న మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పోటీల్లో కెఎల్ యూనివర్శిటీ విద్యార్దులు రూపొందించిన కాన్ శాట్ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రతి కళాశాల ఒక ప్రయోగశాలగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి యూనివర్సిటీలో ప్రయోగాలు జరగాలన్నారు. టెక్నాలజీలో అనేక దేశాలతో భారత్ పోటీపడుతోందన్నారు. 2047కల్లా మన దేశంలో స్వదేశీ పరిజ్నానంతోనే అన్ని రకాల టెక్నాలజీలను మన దేశం అందించాలనే లక్ష్యంతో పలు యూనివర్శిటీలకు ఇశ్రో నిధులను కేటాయిస్తూ పరిశోధనలను ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు 2047 నాటికి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పేరుతో ప్రధాని మోదీ స్వదేశీ పరిజ్నానాన్ని అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ స్థాయిలో కెఎల్ యూనివర్శిటీ పరిశోధనలు చేస్తున్నట్లు అభినందించారు.
ఆంధ్రప్రధేశ్ *డిప్యూటీ స్పీకర్ కె.రఘురామ కృష్ణం రాజు* మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ భవిష్యత్ లో దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా వెలుగొందుతుందన్నారు. ఒకేసారి 3 శాటిలైట్లను ప్రయోగించడం చాలా గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోదీ చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతోందన్నారు. గతంలో ఇతర దేశాల ఉపగ్రహాలను నాసాతయారు చేసేదని , ఇప్పుడు నాసా కంటే కూడా తక్కు వ ఖర్చుతో ఇశ్రో తయారు చేసి ప్రపంచ దేశాలకు దీటైన టెక్నాలజీని అందిస్తుందని అన్నారు. విద్యార్దులు పరిశోధనలు చేసి దేశ అభివృద్దిలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర్ లో బాగంగా కెఎల్ యు విద్యార్దులు రూపొందించిన కెఎల్ శాట్ 2 ఈ నెల 27న ఉత్తర ప్రదేశ్ లో జరగనున్న జాతీయ స్థాయి నానో శాటిలైట్ పోటీలకు కెఎల్ యు విద్యార్దులు ఎంపక కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్బంగా ఉపగ్రహానికి రూపకల్పన చేసిన బృంద సభ్యులను, విద్యార్దులను వర్శిటీ వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్, వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, పరిశోధన, అభివృద్ది డీన్ డాక్టర్ బిటిపి.మాధవ్, అన్ని విభాగాల డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు అభినందించారు.

Comments
Post a Comment