ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక! పరీక్ష ఫీజు గడువు పొడిగింపు!
📢 ఏపీ ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక! పరీక్ష ఫీజు గడువు పొడిగింపు! ⏳
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) మార్చి 2026కు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది.
-విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమైన తేదీలు:
-జరిమానా లేకుండా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్ 31 వ తేది2025
-రూ. 1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 6 వ తేదీ 2025
ముఖ్య సూచన:
ఇదే చివరి అవకాశం అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.
ఇకపై గడువు పొడిగింపు ఉండదు.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు (ప్రైవేట్ అభ్యర్థులు) అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-మీ కళాశాలల ద్వారా త్వరగా ఫీజు చెల్లించండి.
👉 PAAP హెచ్చరిక: దోపిడీని ఆపండి!
-తల్లిదండ్రులారా, మేల్కొనండి!
- బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్ణయం చేసిన ఉత్తర్వుల కాఫీ చూపమని కోరండి.
-కార్పొరేట్ కాలేజీలు ట్యూషన్ ఫీజు పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేసినా, బోర్డు పరీక్ష ఫీజు దానికి సంబంధించిన రసీదును ఖచ్చితంగా తీసుకోండి.
-మన బిడ్డ భవిష్యత్తు కోసం ప్రశ్నించండి!
-మీరు మీ బిడ్డను లక్షలు పెట్టి చదివించే....
* మీ పిల్లలు చదివే కళాశాల కు గుర్తింపు ఉందా..? లేదా పరిశీలించండి.. ప్రశ్నించండి..
* మీ పిల్లలను ఏ కళాశాల కింద పేర్లు నమోదు చేసి పరీక్షలు రాస్తున్నారో మోసాన్ని గమనించండి...
* జిల్లా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారి కి ఫిర్యాదు చేయండి
-మరిన్ని వివరాల కోసం: మీ కళాశాల ప్రిన్సిపాల్‌ను లేదా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ (bie.ap.gov.in)ని సంప్రదించండి.
తల్లిదండ్రులారా, మీ గొంతు కలపండి!
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజి. నెం. 6/2022) ,ఆంధ్రప్రదేశ్ కమిటీ
* 📞 అత్యవసర కాల్ & సంప్రదించడానికి: +91 63053 13558
* 📧 ఈ-మెయిల్: parentsassociationap@gmail.com
#APInter #BIEAP #ExamFee #ఇంటర్మీడియట్ #ఆంధ్రప్రదేశ్ #EducationNews #ఫీజుగడువు

Comments
Post a Comment