గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి.
గిరిజన శాఖ మంత్రి రాజీనామా చేయాలి.
గిరిజన సమాఖ్య డిమాండ్.
రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్.
చిలకలూరిపేట/ పట్టణ శివారులో గల పురుషోత్తమపట్నం నందు గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణము కొరకు మండలంలోని కమ్మవారిపాలెం వద్ద సుమారుగా య. 2.50 సెంట్లు కేటాయించారు. అందుకు సంబంధించి రూ. 4 కోట్లు ప్రణాళికలు రూపొందించారు. నేటికి ఇంతవరకు నిర్మాణము జరుగలేదు. ప్రస్తుతము ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల మరుగుదొడ్లు అస్తవ్యస్తముగా ఉన్నాయి. దీనికి సంబంధించి నిధులు కేటాయించామని చెప్పి ఇంతవరకు మరమ్మత్తులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల తాహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు వినతిపత్రం పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతు గిరిజన గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణము చేపట్టాలని కోరారు. తక్షణమే మరుగుదొడ్ల సమస్య లేకుండా చేయాలన్నారు. ఈ విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఉన్నటువంటి గిరిజన ఏకలవ్య బాలికల పాఠశాలలో ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు .సుమారు 40 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై రేప్ చేసిన దుర్ఘటన బాధాకరమైనప్పటికీ సంబంధిత అధికారులు సకాలంలో స్పందించక పోవడం దారుణమని గిరిజన సమాఖ్య నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గిరిజన గురుకల పాఠశాలల సమస్యలు పరిష్కరించుటలోను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి విఫలమయ్యారు. మరోప్రక్క పాఠశాలలలో విద్యార్థులు అస్వస్థకు గురై చనిపోతా వుంటే సకాలంలో స్పందించలేదని తక్షణమే గిరిజన మంత్రి రాజీనామా చేయాలని గిరిజన సమాఖ్య నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) బి రాంబాబు నాయక్, గిరిజన నాయకులు పాలపర్తి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment