ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏవో , బాణాసంచా అమ్మకం దారులకు సూచనలు..
కృష్ణాజిల్లా.
పెనమలూరు నియోజకవర్గం.
ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏవో , బాణాసంచా అమ్మకం దారులకు సూచనలు..
ఖచ్చితంగా ప్రతి షాప్ కి జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలి, కచ్చితంగా షాపులో పనిచేసే వారికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి..
మేం సర్కులర్ అందజేసిన తర్వాత కూడా అనుమతులు లేకుండా అమ్మకాలు జరిపితే లైసెన్సు మంజూరు కాదు..
ఇప్పటికే పలుచోట్ల కంకిపాడు మండలంలో అనుమతులు లేకుండా షాపులు అమ్మకాలు జరుపుకున్న వాటిపై విచారణకు ఆదేశించాము..
షాపు లైసెన్స్ కలిగిన వ్యక్తి మాత్రమే అమ్మకాలు జరపాలి, షాప్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అనే వివరాలు పూర్తిగా అధికారులకు సమర్పించాలి,
షాపులో ఎవరెవరు పని చేస్తున్నారో వారి పూర్తి వివరాలు మూడు రోజులు ముందుగానే లోకల్ ఎమ్మార్వో గారికి సమర్పించాలి..
ఎన్ని అనుమతులకు లోబడి బాణాసంచా దుకాణాలు అమ్మకాలు నిజంగా జరుగుతున్నాయా...?
అసలు బాణాసంచా అమ్మకాలపై జిఎస్టి అధికారులు ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు..
గోసాల పరిధిలో అనుమతులు లేకుండా అమ్మకాలు జరిపిన షాపులపై రెవెన్యూ అధికారులు ఏమి చర్యలు చేపడతారో వేచి చూద్దాం..

Comments
Post a Comment