వినుకొండ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అన్నదానం కార్యక్రమం
వినుకొండ రోడ్ వరద ప్రభావిత ప్రాంతాలలో అన్నదానం కార్యక్రమం
పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (జీఎస్ఆర్ గారు) ఆదేశాల మేరకు మంథా తుఫాన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వినుకొండ రోడ్ పరిసర ప్రాంతాల్లోని వరద బాధితులకు నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ ఎస్.కే. కరీముల్లా గారు, 6వ వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు మైలూరి మార్క్ గారు పాల్గొన్నారు.
జీఎస్ఆర్ గారు ప్రజల సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్నారని నాయకులు తెలిపారు.






Comments
Post a Comment