అంగన్వాడీ స్కూల్ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్
న్యూస్ 9 ఛానెల్ 7/01/2026
*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం*
*అంగన్వాడీ స్కూల్ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్, నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చిన డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్*
విజయవాడ,తూర్పు నియోజకవర్గం, 4వ డివిజన్ ఏపీ. ఐ ఐ సి కాలనీ రైతు బజార్ ఏరియాలో అంగనవాడి స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ పాల్గొన్నారు.
గద్దె రామ్మోహన్, చెరుకూరి మురళీ మాట్లాడుతూ ఈ విధంగా తెలిపారు.
రోడ్డు నిర్మాణంలో పోయిన అంగన్వాడీ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్, విఎంసి నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చిన డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్. విద్యార్థిని విద్యార్థులకు సరికొత్త రూమ్స్ ఏర్పరిచేందుకు కాంట్రాక్టర్ చెరుకూరు మురళి 15 లక్షలతో నిర్మిస్తానని ముందుకు రావడం జరిగింది సేవా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్,కాంట్రాక్టర్ల లో మంచి అనుభవం కలిగిన చెరుకూరి మురళి ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు అనేకమంది ముందుకు వచ్చి విద్యాలయాలు, హాస్పిటల్స్, రహదారులు అభివృద్ధి చేస్తున్నారు అని అన్నారు.
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా రంగం,వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అనేకమైనవి నష్టపోయాయి అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి వాటిని అభివృద్ధి పరుస్తున్నారు.
ఈ స్కూలును ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయాలని స్థానికుల చిరకాల కోరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్కూల్ స్టాఫ్, సి ఎస్ ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment