బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు

 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం*

న్యూస్ 9 ఛానల్:

3/01/2026

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సదస్సుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు.


4






*బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ కామెంట్స్*:


కష్టాలు వచ్చినా, గిట్టుబాటు ధరలు రాకున్నా.. లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీయ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు


ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శం


నేటికీ భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు


వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగులో కొత్త విధానాలపై ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి


నేడు పురుగు మందులు వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతుంది


ఈ దేశంలో విషన్ని జిమ్మేలా అనేక కుట్రలు చేశారు.


భారతదేశం నేడు ప్రపంచంలో నే అనేక వ్యాధుల్లో మనం నెంబర్ వన్ గా ఉన్నాం


క్యాన్సర్ తో పాటు, అనేక వ్యాధుల బారిన పడేవారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువుగా ఉంది


ఫార్మా కంపెనీలు కుమ్మక్కై వారే సమస్యలను సృష్టించి, వారే మందులను విక్రయిస్తారు


వారిపై ఆధారపడి ఎంతకాలం జీవిస్తామో.. వారు మన జీవితాలతో ఆడుకుంటూనే ఉంటారు


ఉక్రెయిన్ లో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టేందుకు అమెరికా కుట్రలు చేస్తుంది


అమెరికా బేస్డ్ కంపెనీలు మొత్తం వ్యవసాయం ఆధారిత మందులపైనే ఆధారపడ్డాయి


ప్రపంచం మొత్తం అమెరికాపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది


ఇటువంటి వాటి నుంచి బయట పడాలంటే.. ప్రకృతి వ్యవసాయ విధానం చాలా అవసరం


జాతీయ వ్యవసాయ విధానం ద్వారా గో ఆధారిత వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించారు 


2014 లో చంద్రబాబునాయుడు కూడా ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు


ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఈ నూతన వ్యవసాయా విధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి


అన్నిసార్లు మంచి ఫలితాలు రాకున్నా.. లాభాలు తేకున్నా.. చాలా మంది మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు


ఈ సదస్సులో చాలా మంది చెప్పిన అభిప్రాయాలు, ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తాం 


రుణ మాఫీ అనేది కేవలం ఓట్లు సంపాదించుకునేది తప్ప.. శాశ్వత  పరిష్కారం కాదు


మినిమం సపోర్టు ప్రైజ్  ను మూడు వందల శాతం పెంచిన వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి


నేచురల్ ఫామింగ్ ద్వారా రైతులకు మేలు చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది


ఈ సదస్సుద్వారా  రైతులకు సంబంధించి ఒక రాజకీయ తీర్మానం కూడా చేశాం


రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపై ఆలోచన చేసేలా చంద్రబాబును కలిసి విన్నవిస్తాం


ప్రకృతి వ్యవసాయంపై చంద్రబాబు కూడా అభిమానం చూపుతారు.. ప్రోత్సహిస్తారు


కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశాలను తీసుకు వెళ్లి వివరిస్తాం


సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేసేలా చూడాలని ఇప్పటికే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్  ను కలిసి విన్నవించాం


ప్రకృతి వ్యవసాయం చేసే వారిని ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించాలి


ప్రకృతి విపత్తుల వల్ల నష్టోపోయిన రైతులకు మేలు జరిగేలా వంద శాతం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి


చిన్నచిన్న రైతులు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకుని రుణాలు పొందే అవకాశం ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలి


ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు, మార్కెటింగ్ కు కూడా సహకరించాలి 


సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు దొరికే విధంగా ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలి


అన్ని ప్రధాన కేంద్రాల్లో సేంద్రియ రైతు బజార్లను నిర్వహించి.. ప్రజలకు చేరువ  చేయాలి


ఈ ఉత్పత్తుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియ చెప్పేలా అవగాహన కల్పించాలి


దేశ వ్యాప్తంగా 30 శాతం ఆర్గానిక్స్ ఫామ్స్ రావాలని మోడీ లక్ష్యంగా నిర్దేశించారు


రాజకీయ పార్టీలు  కూడా వీటిపై ఆలోచన చేసి ప్రోత్సహించాలి


బీజేపీ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తులను ముందుకు తీసుకు వెళ్లేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం


డిప్యూటీ సిఎం‌ పవన్ కళ్యాణ్ కి కూడా ప్రకృతి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం


ఆయన ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయ విధానాలతో పంటలు పండిస్తున్నారు


ప్రజలు, రైతులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసేలా సహకరించాలి

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి