బ్యాంకు అకౌంట్ ఫ్రిడ్జ్ చేయడంపై వినియోగదారుల సంఘానికి బ్యాంకు ఖాతాదారు ఫిర్యాదు చిలకలూరిపేట
వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కు ఫిర్యాదు చేస్తున్న బ్యాంకు ఖాతాదారు
బ్యాంకు అకౌంట్ ఫ్రిడ్జ్ చేయడంపై వినియోగదారుల సంఘానికి బ్యాంకు ఖాతాదారు ఫిర్యాదు
చిలకలూరిపేట
పట్టణానికి చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావు సుబ్బయ్య తోటలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో తన భార్య పేరు మీద చీరాల రోడ్లో ఉన్న ఒక ప్రాపర్టీని విక్రయించడంతో ప్రాపర్టీ కొన్నటువంటి కొనుగోలుదారులు ఆ మొత్తాన్ని ఆయన భార్య అయిన రజనీకుమారి పేరిట ఆమె ఖాతా ఉన్న యాక్సిస్ బ్యాంకుకు ఆర్టిజిఎస్ చేశారు.
అయితే కొంత కాలం తర్వాత ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు వారిద్దరూ బ్యాంకుకు వెళ్ళగా బ్యాంకు ఖాతాను స్తంభింప చేసినట్టు బ్యాంకు మేనేజర్ వినియోగదారులకి తెలిపారు. బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా జీఎస్టీ డిపార్ట్మెంట్ కు మీరు 18 లక్షలు బకాయి ఉన్నట్టు, బకాయి చెల్లించని కారణంగా మీ ఖాతాను స్తంభింప చేయమని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి ఉత్తర్వులు వచ్చాయని అందు కారణంగా ఖాతాను స్తంభింప చేసినట్టు బ్యాంకు మేనేజర్ వారికి వివరణ ఇచ్చారు. కాగా వినియోగదారులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వెళ్లి అక్కడ జీఎస్టీ అధికారికి తాము ఎటువంటి వ్యాపారం చేయలేదని, అయినప్పటికీ మా పేరు మీద నోటీసులు ఎందుకు ఇచ్చారు అని అడగడం జరిగింది. వీరి పేరుమీద
ఖమ్మం జిల్లాలో ఒక సంస్థ ఉందని ఆధార్ అదేంటికేషను ద్వారా జీఎస్టీ లైసెన్సు తాము మంజూరు చేసామని, ఒక నెల వ్యాపారం చేసి పన్ను కట్టని కారణంగా వారి ఖాతాను స్తంభింప చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు జిఎస్టి అధికారులు తెలిపారు. ఈ సమస్యపై ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో విచారించిన అధికారులు ఇది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం లో జరిగింది కాబట్టి ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని రాతపూర్వకంగా ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. కాగా సోమవారం వినియోగదారుడు దీనిని వినియోగదారుల
కోర్టులో కేసు నమోదు చేసుకునేందుకు సహకరించవలసిందిగా పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ ని కలిసి సంబంధిత ఆధారాలను, మరియు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ దీని గురించి బ్యాంకు అధికారులతో మాట్లాడి సేవా లోపం ఉన్నట్లు తెలిస్తే వినియోగదారుల కోర్టులో కేసు నమోదు చేసేందుకు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ గా ఫిర్యాదు దారునికి సహకరిస్తామని అన్నారు.

Comments
Post a Comment