నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్.

 06-01-2026

నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్...



              నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా   విజయనగరం జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాలలో అత్యధికంగా మద్యం అమ్మకం అయినది మన బొబ్బిలిలోనే అని లోక్ సత్తా నాయకుడు ఆకుల దామోదర రావు అన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంద పడాలో లేక బాధ పడాలో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ కొత్త సంవత్సరం వేళ మన రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలను గమనిస్తే డిసెంబర్ 31 వ తేదీ ఒక్కరోజే దాదాపు 200 కోట్ల రూపాయల మద్యం మన మందు బాబులు తాగారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచే డిపోల నుండి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తారు. ఈ సారి డిసెంబరు 29,30,31 తేదీలలో 542.89 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరితే, మొత్తం 6.75 లక్షల ఐఎమ్ఎల్ కేసులు, 2.94 లక్షల కేసుల బీరు వెళితే అందులో డిసెంబరు 31 ఒక్కరోజే 2.65 లక్షల ఐఎమ్ఎల్, 1.15 లక్షల బీరు కేసులు అమ్ముడయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా.

               ఇక మన విజయనగరం విషయానికి వస్తే డిసెంబరు 31, జనవరి 1 న మన జిల్లా లోని మందు బాబులు పెద్ద ఎత్తున తాగేసారు. ఆ రెండు రోజుల్లో 11.56 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణ రోజుల్లో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకూ సరుకు బయటికి వెళ్లగా ఈ సారి మాత్రం మూడింతలు పెరినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని మన బొబ్బిలి లోనే అత్యధికంగా 1.63 కోట్ల మద్యం అమ్ముడవగా తక్కువగా ఎస్ కోటలో 76.12 లక్షలు అమ్ముడయింది. మొత్తం మీద జిల్లాలో ఐఎమ్ఎల్ 16,093 కేసులు, బీర్లు 6,235 కేసులు అమ్మకాలు జరిగాయి. ఏది ఏమయినా కూటమి ప్రభుత్వ హయాంలో మన బొబ్బిలి అభివృద్ధిలో కన్నా మద్యం అమ్మకాలలో దూసుకపోవడాన్ని చూసి ఏమనాలో అర్థం కాని పరిస్థితి అని ఆయన అన్నారు.

                ఈ మధ్యనే నేను మన బొబ్బిలి విలేకరి సామాజిక మధ్యమాలలో ఓ వీడియో పెట్టగా చూసాను. మన బొబ్బిలిలో మద్యం సీసాల మీద ఉన్న అసలు ఎమ్ఆర్పీ లేబుళ్లని తొలగించి ధర పెంచి వేసిన లేబుళ్లని వేసి అమ్ముతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియని పరిస్థితి. ఇలా రేట్లు పెంచి అమ్మితే మన బొబ్బిలి మద్యం అమ్మకాలలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కనీసం ఇకనైనా పాలకులు, అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి ఈ అక్రమ మద్యం వ్యాపారాన్ని కట్టడి చేసి మద్యం బాధిత కుటుంబాలని ఆదుకోవాలని నా విజ్ఞప్తి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి