విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి..
న్యూస్ నైన్ ఛానల్
11/01/2026
కృష్ణాజిల్లా
*విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి..*
*రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి..*
నాకు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించారు..
మన అని, మన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారని ఇక్కడకు వచ్చాము..
*అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆగ్రహంతో ఒక మాట అన్నాను..*
*కొండపైన అమ్మ వారు.. కొండ కింద కమ్మ వారు..*
*ఆ తల్లి ఆశీసులతో ఈ కులాన్ని కాపాడుకోవాలి..*
ఈ అవకాశం నేను పోగొట్టుకోకూడదని ఇక్కడకు వచ్చాను..
నేను 13 సంవత్సరం నుండే ట్రాక్టర్ నడిపాను..
అన్నిట్లో నువ్వు సమానమే అని నా తల్లిదండ్రులు నన్ను పెంచారు..
నువ్వు ఆడపిల్లవు నువ్వు తగ్గు అని ఏనాడు చెప్పలేదు..
మన కులంలో మహిళలను ముందుకు తీసుక రండి..
*ఎక్కడ మనం తగ్గాల్సిన అవసరం లేదు..*
అమరావతి రైతుల పోరాటం తో ఇక్కడ గవర్నమెంట్ మారెవరకు అందరూ సహకరించారు..
కరెంట్ లేకపోయిన కంఠం వినిపించాలి..
*అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మన కోసం వెతుకుతుండేవారు..*
ఈ కులం లో పుట్టినందుకు నాకు ధైర్యం వచ్చింది..
*మనం ఆర్డినరీ పీపుల్ కాదు ఎక్స్ట్రార్డినరీ పీపుల్..*
*అమరావతి కాదు ఇది కమరావతి అని తూలుతూ మాట్లాడిన వారికి ఛాలెంజ్ చేశాము..*
ఉమ్మడి రాష్ట్రం లో అన్ని రంగాలలో పునాదులు వేసినది కమ్మ వారు..
అందరూ అమెరికా ప్రయాణం చేస్తున్నారు..
నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ మూలాలు ఇక్కడే ఉన్నాయని మరిచిపోవద్దు..
అందరినీ మోసే గొప్పతనం మన కమ్మ వారిది..
అప్పట్లో వార బోజనాలు పెట్టీ విద్య నేర్పించిన ఘనత మనది..
*ఇంతకు ముందు గవర్నమెంట్ అవసరికి కరెంట్ లేకుండా చేసేవాళ్ళు..*
ఎన్నికల సమయంలో నేను విజయవాడ నుండి ఖమ్మం వెళుతున్నప్పుడు రోడ్డు పొడవునా జనం జాతర కనిపించింది..
ఓటు వేసాము మేడం అని చూపించారు..
*నేను ఆ రోజే చెప్ప గవర్నమెంట్ పోతుందని..*
*అందరికీ పెట్టే మనల్ని వాళ్ళు వచ్చి తొక్కితే మనం ఎందుకు ఊరుకుంటాము..*
రాజకీయాలలోకి మన వాళ్ళు రావాలి..
విజయాలు సాధించాలి..
మన జీన్స్ లోనే ఓర్పు సహనం ఉంది..
*ఎవరో చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించే రకం కాదు మనం..*
*మనం లేకపోతే సగం మంది సీట్లు క్షవరం అవుతాయి..*
నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన వారు ఎన్టీఆర్..
*ఎన్టీఆర్ జాతకంలో, నెత్తురు లో భయం లేదు..*
*మా జాతకాలు జీవితాలు మార్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు..*
*పెద్ద పెద్ద సూట్ కేసులతో వచ్చి ఈ రాజ్యసభ సీటు ఇవ్వమని అడిగేవారు..*
*డబ్బుకు లాలూచీ పడి నందమూరి ఎప్పుడు చెయ్యి చాచలేదు..*
జైలుకు పంపిస్తామంటే మనమెందుకు భయపడాలి..
*మనం జేబు దొంగలం కాదు.. జైలుకు వెళ్లవలసి వస్త వెళదాం..*
చిన్న విషయాలకు వెనక్కు వస్తె చరిత్ర మారిపోతుంది..
అమెరికాలో ఒక ట్రంపు కూర్చున్నాడు జాగ్రత్త..

Comments
Post a Comment