క్రీడా రంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ రవినాయుడు

 **క్రీడా రంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ రవినాయుడు*:

న్యూస్ 9 ఛానల్:



ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం.


04 జనవరి 2026


**2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రీడా శాఖ కృతజ్ఞతలు*:

2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖకు, ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడా రంగ అభివృద్ధికి నిరంతర సహకారం అందించిన మీడియా సోదర–సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని క్రీడా శాఖ వెల్లడించింది. మీ ప్రోత్సాహం, మద్దతు 2026 సంవత్సరంలో కూడా ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొంది.






గతంలో రాష్ట్ర క్రీడా విభాగం స్పష్టమైన పాలసీ లేకుండా, మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో నిద్రాణావస్థలో కొనసాగింది. తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో సమగ్ర క్రీడా విధానం లేకపోవడంతో, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ పాలసీపై మీడియా ప్రతినిధులు, క్రీడా సంఘాలు, ప్లేయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ నెలలోనే అవసరమైన మార్పులు, సవరణలు చేస్తున్నాం ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఆసియన్ గేమ్స్‌లను లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అమలు చేస్తున్న మోడల్‌ను రాష్ట్రంలోనూ అనుసరించేందుకు నిర్ణయం తీసుకున్నాము  ఈ దిశగా క్రీడల్లో ముందున్న తమిళనాడు సహా దాదాపు 17 రాష్ట్రాల పనితీరును అధ్యయనం చేశాము. దాదాపు 54 కోట్ల విలువైన క్రీడా మౌలిక వసతుల ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి చేసి, జనవరి 12 నాటికి అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా పారదర్శకంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

శాశ్వత క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి భాగంగా శ్రీకాకుళంలో మూర్తి స్టేడియం అభివృద్ధి విశాఖపట్నం – కొమ్మాదిలో సుమారు ₹25 కోట్లతో స్టేడియం పనులు విజయనగరంలో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు నిర్ణయం ఈ అంశాలను క్రీడా పాలసీలో చేర్చి, ముఖ్యమంత్రి  ఆమోదంతో చర్యలు ప్రారంభించాము. మార్చి నాటికి భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. అరకు–పాడేరు ప్రాంతాల్లో క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన పిల్లల కోసం ఎస్టీ కంపోనెంట్ నిధులతో పాటు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కాకినాడలో ఖేలో ఇండియా పథకం కింద సింథటిక్ ట్రాక్ పూర్తి చేసి, అక్కడే క్రీడా అకాడమీ ఏర్పాటు.  వాటర్ గేమ్స్‌తో పాటు మల్టీ పర్పస్ స్పోర్ట్స్ అభివృద్ధికి కూడా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రాజమండ్రిలో అమరావతి పుష్కరాల పేరుతో మల్టీ పర్పస్ స్టేడియం ఇప్పటికే ప్రారంభమైంది. భూమి కేటాయింపు పూర్తయి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా ఏలూరు కేదార్ ప్రాంగణంను వెయిట్‌ లిఫ్టింగ్ వంటి క్రీడలకు అనుకూలంగా సుమారు 8–10 కోట్లతో మరమ్మత్తులు చేయడానికి త్వరలోనే శ్రీకారం. ఒక అసోసియేషన్‌లో పాత–కొత్త సభ్యులతో కూడిన మిక్స్‌డ్ అసోసియేషన్ కారణంగా కొంతకాలంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు ఒక మహిళ ఫిర్యాదు చేయగా దానికి అనుబంధంగా సర్టిఫికెట్ల విషయంలో కూడా పలు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. మొత్తం 28 మంది క్రీడాకారుల సర్టిఫికెట్లు నకిలీవని ఆరోపణలతో ఫిర్యాదులు నమోదు కాగా, ఈ అంశాన్ని ప్రీమియం కమిటీ పరిశీలనకు పంపించినట్లు తెలిపారు. 

ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు ఐదు సార్లు అప్లికేషన్లు వచ్చినప్పటికీ, అందులో 11 మంది సంబంధిత వ్యక్తులు హాజరు కాకపోవడంతో విచారణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందన్నారు. న్యాయం పారదర్శకతతో సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో కమిటీ విచారణ కొనసాగుతోంది.

అవసరమైతే సంబంధిత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని క్రీడా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి, ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యము.

ఈ ప్రయాణంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని మరోసారి క్రీడా శాఖ పేర్కొంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి