ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం, ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం ఇప్పటివరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్న తన బృదంతో కలిసి నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు..
మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు..
ఈ క్రమంలో తాము తయారు చేసిన మధ్యంతర బడ్జెట్ తో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం ఫొటో దిగారు. ఈ మధ్యంతర బడ్జెట్ పేపర్ లెస్ గా ఉండబోతోంది. గత కొంతకాలంగా టాబ్ లో బడ్జెట్ ను పేపర్ లెస్ గా సమర్పిస్తున్నారు..
బడ్జెట్ సమర్ఫణకు నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర, దానికి మ్యాచింగ్ గా హాఫ్ వైట్ బ్లౌజ్ వేసుకున్నారు. చేతిలో ఎరుపురంగు పౌచ్ లో ఉన్న టాబ్ ను పట్టుకున్నారు..