Posts

Showing posts from March, 2026

Mr ఫ్రెండ్స్ సర్కిల్ ఆద్యరంలో ఉచిత చలివేండ్రం

Image
 విజయవాడ... పశ్చిమ నియోజవర్గంలో 35 వ డివిజన్ పప్పుల మిల్ సెంటర్ దగ్గర Mr ఫ్రెండ్స్ సర్కిల్  ఆద్యరంలో ఉచిత చలివేండ్రం శ్రీరావనవమి ఘనంగా నిర్వహించారు  పప్పుల మిల్ సెంటర్  దగ్గర ఉచిత చలివేండ్రం ఏర్పాటు చేశారు ఎండాకాలంలో ప్రజలుకు  మంచి నేటి సమస్య ఎక్కువగా ఉంటుంది   అందుకనే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉచిత మంచినీటి ఏర్పాటు చేశాం  విజయవాడలోనే ప్రతి హోటల్ దగ్గర మంచినీరు అమ్ముకుంటున్నారు   ఎమ్మార్

వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మహిళలు అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని

Image
 వినియోగదారుల హక్కులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి చిలకలూరిపేట వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మహిళలు అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని **కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్** పేర్కొన్నారు.   గురువారం చిలకలూరిపేట పట్టణంలో వినియోగదారుల సంఘం సభ్యులు బృందాలుగా ఏర్పడి నరసరావుపేట సెంటర్, కళామందిర్ సెంటర్, చౌత్రా సెంటర్ తదితర ప్రధాన వీధుల్లో మహిళలకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ **కరపత్రాలు పంపిణీ*చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ జీవితంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం, సరైన తూకాలు, పాటించడం, కల్తీ ఆహార పదార్థాల గుర్తింపు వంటి అంశాలపై మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.   మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు తూకాల్లో మోసం చేయడం, నాణ్యత లేని వస్తువులను విక్రయించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగాగ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు పాటించవలసిన అంశాల గురించి వివరిస్తూ  సిలిండర్ డెలివరీ తీసుకునే సమయంలో  గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన బిల్లు మాత్రమే చెల్లించాలని, ఇతర చార్జీలు చెల్లించవలసిన అవసరం ల...

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కృతిక శుక్లా

Image
 *ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కృతిక శుక్లా*         నరసరావుపేటలో మార్కెట్ యార్డ్ నందు ఉన్న  ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను  జిల్లా కలెక్టరు కృతిక శుక్లా  తనిఖీ చేశారు. ఈవియం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భధ్రతా ఏర్పాట్లను ఈవియం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి  పరిశీలించారు. అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవియం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు  మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవియం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఎప్పటి కప్పుడు గౌడౌన్ ను క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. ఈవియం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు.

గ్యాస్ సిలిండర్ల వాడకంలో అడ్డదారులు తొక్కితే జైలుకే

Image
 వ్యాపారులకు DSO వార్నింగ్: గ్యాస్ సిలిండర్ల వాడకంలో అడ్డదారులు తొక్కితే జైలుకే ​పల్నాడు: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా సరఫరా అధికారి (DSO) ప్రసాద్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.  హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ అవసరాల (డొమెస్టిక్) సిలిండర్లు వాడటం నేరమని ఆయన స్పష్టం చేశారు. ​ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశామని వెల్లడించారు. ​ నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

విష్ణు బిల్డర్స్ నిర్మించిన మెగా టౌన్ షిప్ అపార్ట్మెంట్ లో మాకు కేటాయించిన సెల్లార్లో వేరే వాళ్ళు షాపులు నిర్మిస్తున్నారని

Image
 న్యూస్ 9 ఛానల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయవాడ అయప్పనగర్ లో విష్ణు బిల్డర్స్ నిర్మించిన మెగా టౌన్ షిప్ అపార్ట్మెంట్ లో మాకు కేటాయించిన సెల్లార్లో వేరే వాళ్ళు షాపులు నిర్మిస్తున్నారని  న్యూ ఆర్టీసీ కాలనీ,ఎలక్ట్రిసిటీ కాలనీ పరిసర ప్రాంతాల అభివృద్ధి కమిటీ సెక్రటరీ బచ్చు వెంకటనారాయణ ,అపార్ట్మెంట్ వాసులు కె.రాజశేఖర్ రెడ్డి, కె దుర్గా వరప్రసాద్ రెడ్డి తండ్రి పాండురంగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బచ్చు వెంకటనారాయణ,రాజశేఖర్ రెడ్డి ప్లాట్, షాప్ ల ఓనర్, దుర్గా వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ  1999 విష్ణు బిల్డర్స్  మెగా టౌన్షిప్ ను ప్రారంభించడం జరిగింది.అప్పట్లో కొంతమంది షాపులు నిర్మించడం జరిగిందని, అసోసియేషన్ తరుపు మేము వ్యతిరేకించడం జరిగిందన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ షాపులను తొలగించడం జరిగింది.తొలగించిన తర్వాత ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగలేదని, ప్రస్తుతం వేరే అపార్ట్మెంట్ నుండి కొంతమంది వచ్చి మీ అపార్ట్మెంట్ పార్కింగ్ నేను కొనుగోలు చేశాను అని చెప్పి గోడలు కట్టడం జరిగిందని, 2 సంవత్సరాల క్రితం కమిషనర్ ...

జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’*

Image
*వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: జాయింట్ కలెక్టర్ సంజనా సింహ*  ​ *జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’*  ​నరసరావుపేట, మార్చి 17 వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని పి.జి.ఆర్.ఎస్  హాలులో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులకు మరియు సమాజానికి మెరుగ్గా వివరించగలరని ఆమె ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చ...

బ్లాక్ మార్కెట్ అరికట్టాలి – డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగించకుండా చర్యలు

Image
 ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి. వినియోగదారులను ఇబ్బంది పెట్టవద్దు – తాసిల్దార్‌కు విజ్ఞప్తి బ్లాక్ మార్కెట్ అరికట్టాలి – డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగించకుండా చర్యలు తీసుకోవాలి మురికిపూడి ప్రసాద్  కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు  ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధ  పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా, ధరలపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు చిలకలూరిపేట తాసిల్దార్‌ షేక్ మొహమ్మద్ హుస్సేన్ కు శుక్రవారం వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.  కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆలస్యం, అధిక ధరలకు విక్రయాలు, బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగించడం వల్ల సాధారణ ...

చిలకలూరిపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్

Image
 *చిలకలూరిపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ సంజనా సింహ*  చిలకలూరిపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18 వ తేదీ నుంచి ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నుంచి తప్పుకోనుంది. పురపాలక సంఘం పాలన లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి,కొత్త పాలకవర్గం కొలువు జరిగే వరకు ఈ ప్రత్యేక అధికారి పాలన కొనసాగనుంది.

విద్యార్థుల ప్రతిభకు వేదికగా నారాయణ స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

Image
 విద్యార్థుల ప్రతిభకు వేదికగా నారాయణ స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ చిలకలూరిపేట, మార్చి 5, న్యూస్ 9 చిలకలూరిపేటలోని Narayana School బ్రాంచ్‌లో నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విద్యా ప్రగతి, ప్రతిభను తల్లిదండ్రుల ముందు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా AGM వై. లక్ష్మణ్ రెడ్డి, ZCO గౌసియా హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు, మోడల్స్ మరియు వివిధ క్రియేటివ్ వర్క్‌లను స్వయంగా వివరించి తల్లిదండ్రులకు తమ అభ్యాస స్థాయిని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శేషగిరిరావు అధ్యక్షత వహించి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ నాగవర్ధని పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు విద్యా...

గిన్నెస్ రికార్డ్ సృష్టించిన NBEMS: AI హెల్త్‌కేర్‌లో ప్రపంచ రికార్డ్!....

Image
 *గిన్నెస్ రికార్డ్ సృష్టించిన NBEMS:*  AI హెల్త్‌కేర్‌లో ప్రపంచ రికార్డ్!.... డాక్టర్ కొమ్మినేనికి అభినందనలు. వైద్య విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అరుదైన ఘనతన వైద్య విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అరుదైన ఘనతను సాధించింది. "హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేధస్సు (AI in Healthcare)" అనే అంశంపై నిర్వహించిన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ క్లాసులకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వీక్షకులు హాజరైనందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఈ చారిత్రక ఘట్టంలో చురుగ్గా పాల్గొన్న వీర శంకరరావు కొమ్మినేని కి NBEMS ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. వైద్య విద్యార్థులు మరియు నిపుణుల అచంచలమైన మద్దతు వల్లే ఈ విజయం సాధ్యమైందని బోర్డు పేర్కొంది.  ప్రపంచ రికార్డ్ ఆరోగ్యరంగంలో ఏఐ వినియోగంపై నిర్వహించిన ఆన్‌లైన్ తరగతులకు రికార్డ్ స్థాయిలో స్పందన లభించింది.  దేశానికి గర్వకారణం: ఈ విజయం కేవలం NBEMS ఘనత మాత్రమే కాకుండా, వైద్య రంగంలో సాంకేతికత పట్ల భార...

ఎంపీ కేశినేని శివనాద్ గారి చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి

Image
 *తిరువూరు*  *ఘనంగా నెమలి వేణుగోపాల స్వామి మహోత్సవాలు* నెమలి స్వామి వారి కల్యాణోత్సవంలో ఎంపీ కేశినేని శివనాద్ గారి చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వీడియో క్లిపింగ్ *కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు* *కళ్యాణోత్సవానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్ని దంపతులకు ఘనస్వాగతం పలికిన ఆలయ పాలకమండలి, అధికారులు *భక్తుల మధ్య కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించిన  ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు*   *ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా కామెంట్స్:* *నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని,ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాలస్వామిని వేడుకున్నా*  *నెమలి వేణుగోపాలస్వామి ఆలయాన్ని మరింత గా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా*  *రానున్న కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగయ్యేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తాం* *మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు జరిగాయి* *కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా జరిగింది...